కొనసాగుతోన్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్..! తెలంగాణ నేతల క్యూ..!

కొనసాగుతోన్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్..! తెలంగాణ నేతల క్యూ..!

తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన భారతీయ జనతా పార్టీ... ఆపరేషన్ ఆకర్ష్‌ను కొనసాగిస్తోంది. కొన్ని రోజుల్లో బీజేపీలోకి ఇతర పార్టీల నేతలు భారీగా చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ టూర్‌ కూడా ఖరారైంది. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది బీజేపీ. ఈ సభలో టీడీపీ నేత గరికపాటి సహా.. 20 మంది ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. గరికపాటితో పాటు టీడీపీలో కీలకంగా పనిచేసిన నేతలంతా బీజేపీలో చేరేందుకు క్యూకడుతోన్నట్టు సమాచారం. టీడీపీ నేతలందరినీ బీజేపీలోకి తీసుకొచ్చేందుకు గరికపాటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీడీపీ నేతలు 18వ తేదీన బీజేపీ చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక, ఈ బహిరంగసభకు అమిత్‌షాతో పాటు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా హాజరు కానున్నారు.