నేడు, రేపు తేలికపాటి వర్షాలు

నేడు, రేపు తేలికపాటి వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా నేడు రేపు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఉత్తర ప్రదేశ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరిత ఆవర్తనం కొనసాగుతున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.  ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అన్నారు.