తెలంగాణకు వర్షసూచన

తెలంగాణకు వర్షసూచన

తెలంగాణలో ఇవాళ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మాల్దీవుల నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడగా... దీని ప్రభావంతో తేమ గాలులు వీస్తూ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, చలి క్రమంగా తగ్గుముఖం పడుతుందన్నారు.