'కేటీఆర్‌ అన్నా.. మీరే నన్ను కాపాడాలి'

 'కేటీఆర్‌ అన్నా.. మీరే నన్ను కాపాడాలి'

ఉన్న ఊరిలో ఉపాధి లేక.. పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లాడు. బ్రోకర్‌ చెప్పిన పనికి.. ప్రస్తుతం అక్కడ చేసే పనికి పొంతన లేకపోవడంతో యాతన పడుతున్నాడు. ఎడారిలో గొర్రెలను మేపుతూ పడుతున్న అవస్థలను వీడియో ద్వారా కేటీఆర్‌కు పంపించాడు రాజన్నసిరిసిల్ల జిల్లా  ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఎండి సమీర్ అనే యువకుడు. సౌదీలో తాను పడుతున్న కష్టాలను ఏకరవు పెట్టిన ఆ యువకుడు మీరే ఆదుకోవాలంటూ కేసీఆర్‌ను వేడుకున్నాడు. 
'సౌదీలో నన్ను సంపుతుండ్రు. ఏజెంట్ మోసంతో నరకయాతన పడుతున్నా.. 20 రోజులుగా తిండి లేదు. మీరే నన్ను కాపాడాలి' అని ఆ వీడియోలో సమీర్‌ పేర్కొన్నాడు.  వెంటనే స్పందించిన కేటీఆర్‌..  సౌదీలో ఉన్న ఇండియా ఎంబసీకి సమీర్‌ గోడును నివేదించారు.