కికి ఛాలెంజ్ లో తెలంగాణ యువరైతుల హంగామా

కికి ఛాలెంజ్ లో తెలంగాణ యువరైతుల హంగామా

హాలీవుడ్ పాపులర్ సింగర్ డ్రేక్ ఇన్ మై ఫీలింగ్ సాంగ్ ను స్ఫూర్తిగా తీసుకొని కికి ఛాలెంజ్ ను తెరపైకి తీసుకొచ్చారు.  నడుస్తున్న కారులోనుంచి కిందకు దిగి ఇన్ మై ఫీలింగ్ అని పాట పాడుతూ స్టెప్స్ వేయాలి.  ఇలా డ్యాన్స్ చేస్తూ దిగిన క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.  ఇది ఛాలెంజ్.  యువత ఈ ఛాలెంజ్ విపరీతంగా ఆకర్షితులయ్యారు.  ఇప్పుడు ఈ ఛాలెంజ్ తెలంగాణా రాష్ట్రంలో నగరాల నుంచి పల్లెలకు కూడా పాకింది.  

తెలంగాణాలోని లంబాడి పల్లె గ్రామానికి చెందిన అనీల్ గీలా, పిల్లి తిరుపతి అనే ఇద్దరు రైతులు పొలంలో ఎద్దులతో దుక్కి దున్నుతూ.. ఇన్ మై ఫీలింగ్ అనే సాంగ్ కు డ్యాన్స్ చేశారు.  ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. మై విలేజ్ షో అనే ఛానల్ ను స్థాపించిన అనిల్ గ్రామాల్లోని టాలెంట్ ను వెలికి తీస్తున్నారు.  ఇప్పటికే సోషల్ మీడియాలో మై విలేజ్ షో చాలా పాపులర్ అయింది.