సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు ఆమోదం

సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు ఆమోదం

సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆమోదం తెలిపింది. కార్మికులకు తీర్పు అనుకూలంగా రావడంతో సంబురాలు చేసుకున్నారు. మిల్లు పునురద్దణకు కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ధన్యవాదాలు తెలిపారు. రూ. 420 కోట్ల నష్టాలు వచ్చాయని 2014 సెప్టెంబర్‌ 27న పేపర్‌ మిల్లును యాజమాన్యం మూసివేసింది. దీంతో రెండు వేల మంది కార్మికులు, 1500 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు ఉపాధి  కోల్పోయారు. ప్రభుత్వం పలుసార్లు చర్చలకు ప్రయత్నం చేసినా యాజమాన్యం ముందుకురాలేదు. రుణం తీర్చకపోవడంతో ఐడీబీఐ బ్యాంకు మిల్లును స్వాధీనం చేసుకుని గతేడాది ఫిబ్రవరిలో వేలం వేసింది. వేళలంలో జేకే యాజమాన్యం మిల్లును దక్కించుకుంది. ఈ క్రమంలో కొందరు తమకు రావాల్సిన బకాయిల కోసం కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం తీర్పుతో అడ్డంకులు తొలగిపోవడంతో మిల్లు ప్రారంభించేందుకు జేకే యాజమాన్యంకు మార్గం సులువైంది.