కెజిఎఫ్ 2లో తెలుగు యాక్టర్ !

కెజిఎఫ్ 2లో తెలుగు యాక్టర్ !

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ 'కెజిఎఫ్ 2'.  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ నాటికి అన్ని పనుల్ని పూర్తి చేసుకుంటుంది.  ఈ చిత్రంలో తెలుగు నటుడు రావు రమేష్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం.  అయితే ఆ పాత్ర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

ఈ రెండవ భాగం గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సెకండ్ పార్టీ ఇంకా హెవీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుందని, వరల్డ్ మాఫియాను భారీ స్థాయిలో చూపించడం జరుగుతుందని అన్నారు.  మొదటి భాగం భారీ హిట్టవడం మూలాన రెండవ భాగానికి డిమాండ్ ఎక్కువగా ఉంది.  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కళ్ళు చెదిరే స్థాయిలో జరిగినట్టు సమాచారం.