ఐపీఎల్ 2020 లో ఆడనున్న తెలుగు క్రికెటర్లు వీళ్లే...

ఐపీఎల్ 2020 లో ఆడనున్న తెలుగు క్రికెటర్లు వీళ్లే...

కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 29 న జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడింది. అయితే మన భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఐపీఎల్ వేదికను యూఏఈ కి మార్చేసింది బీసీసీఐ. అక్కడ కేవలం మూడు వేదికలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరగనుంది. అయితే ఇక ఈ ఐపీఎల్ 2020 లో మన తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఆడబోతున్నారు. ఇందులో అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజ్ ఇప్పటికే కొన్ని సీజన్లు ఆడగా హైద్రాబాద్ లోని రాంనగర్ కి చెందిన బావనక సందీప్ ఈ ఏడాది ఐపీఎల్ లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఈ యువ క్రికెటర్ ను ఐపీల్ 2020 లో 20 లక్షలకు సన్‌రైజర్స్ హైద్రాబాద్‌ కొనుగోలు చేసింది. 18 ఏళ్ల వయస్సులో రంజీ మ్యాచ్‌లో రంగప్రవేశం చేసిన సందీప్‌ ఇప్పటివరకు 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 సగటుతో తన ప్రతిభను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ రంజీ జట్టు కు వైస్‌కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇక రాయుడు, సిరాజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఇప్పటికే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఈ ఏడాది యూఏఈ లో జరిగే ఐపీఎల్ లో ఈ తెలుగు క్రికెటర్లు ఎలా రాణిస్తారు అనేది చూడాలి.