విషాదం : అమెరికాలో తెలుగు కుటుంబం బలి

విషాదం : అమెరికాలో తెలుగు కుటుంబం బలి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింత కుంట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు అమెరికాలోని టెక్సాస్ నగరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని చెబుతున్నారు. టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం తో ఉమ్మడి పాలమూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరికల్ మండలం పెద్ద చింతకుంటకు చెందిన నరసింహ రెడ్డి , దంపతులతో పాటు కుమారుడు భరత్ యాక్సిడెంట్ లో మృతి చెందగా కూతురు మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. కూతురు మౌనికకు పెళ్లి సంబంధం చూసేందుకు నరసింహ రెడ్డి దంపతులు అమెరికా వెళ్లారని అయితే కోవిడ్ కారణంగా వీసా జారీలో జాప్యం కావడంతో అక్కడ నరసింహ రెడ్డి దంపతులు ఉండి పోయినట్లు చెబుతున్నారు.