జాతీయ అవార్డుల వేటలో తెలుగు సినిమాలు !

జాతీయ అవార్డుల వేటలో  తెలుగు సినిమాలు !

2018వ సంవత్సరానికిగాను జాతీయ సినీ అవార్డుల్ని ఇంకొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు.  ఈ అవార్డుల రేసులో తెలుగు పరిశ్రమ నుండి కూడా నాలుగు సినిమాలు పోటీపడుతున్నాయి.  వాటిలో మొదటిది నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన 'మహానటి' కాగా రెండవది రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం'.  ఇక మూడవ సినిమాగా విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి చేసిన 'గీత గోవిందం' కాగా నాల్గవది రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన 'చి.ల.సౌ' కావడం విశేషం.  మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏది జాతీయ అవార్డును గెలుచుకుంటుందో చూడాలి.