డిజైరబుల్ మెన్ జాబితాలో మన హీరోలు !

డిజైరబుల్ మెన్ జాబితాలో మన హీరోలు !

టైమ్స్ మ్యాగజైన్ ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను ప్రకటించింది.  ఆన్ లైన్ ఓటింగ్ నిర్వహించి ఈ జాబితాను తయారుచేశారు.  ఈ జాబితాలో మన తెలుగు హీరోలు సైతం చోటు దక్కించుకున్నారు.  వారిలో మొదటగా యువ హీరో విజయ్ దేవరకొండ 4వ స్థానాన్ని సాధించగా రెబల్ స్టార్ ప్రభాస్ 12వ స్థానాన్ని దక్కించుకున్నాడు.  ఇక దగ్గుబాటి రానా 19వ స్థానంలో నిలిచాడు.  జాబితాలో మొదటి స్థానాన్ని బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అందుకోగా గతేడాది ప్రథమ స్థానాన్ని పొందిన రణ్వీర్ సింగ్ ఈసారి 3వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.