2018 అమెరికాలో తెలుగు సినిమాల పరిస్థితి !

2018 అమెరికాలో తెలుగు సినిమాల పరిస్థితి !

ఈ 2018లో మన తెలుగు పరిశ్రమకు మంచి విజయాలే దక్కాయి.  వాటిలో 'రంగస్థలం, మహానటి, గీత గోవిందం' వంటి సినిమాలున్నాయి.  ఇవి ఇక్కడే కాదు అమెరికాలో కూడ దుమ్మురేపాయి.  రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించాయి.  ఒక్కసారి యూఎస్ బాక్సాఫీస్ ముందు భారీ సక్సెస్ అందుకున్న సినిమాల్ని చూస్తే 3.5 మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో రామ్ చరణ్, సుకుమార్ ల 'రంగస్థలం', 3.4మిలియన్లతో మహేష్, కొరటాల శివల 'భరత్ అనే నేను', 3వ స్థానంలో 2.5 మిలియన్లతో 'మహనటి', 4వ స్థానంలో 2.4 మిలియన్లతో 'గీత గోవిందం' ఉన్నాయి.