టిబెట్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

టిబెట్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

చైనాలోని మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు టిబెట్‌లో చిక్కుకున్నారు. టిబెట్‌లోని సిమ్‌కోటలో దాదాపు 40 మంది తెలుగు యాత్రికులు పడిగాపులు కాస్తున్నారు. ఆరు రోజులుగా తీవ్రమైన చలిలో వారందరు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆహారం, మందుల కొరత ఉండటంతో.. ముఖ్యంగా వృద్ధులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తీవ్ర మంచు కారణంగా వాతావరణం అనుకూలించక పోవడంతో నేపాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రైవేట్ హెలికాఫ్టర్లు నిలిచిపోయాయి. దీంతో తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు అధికారులకు కోరారు.