తెలుగు యాత్రికులను గాలికొదిలేసిన సదరన్ ట్రావెల్స్

తెలుగు యాత్రికులను గాలికొదిలేసిన సదరన్ ట్రావెల్స్

పవిత్ర చార్ ధామ్ యాత్రలో తెలుగువారు అష్టకష్టాలు పడుతున్నారు. యాత్రికుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసిన సదరన్ ట్రావెల్స్ యాత్ర మధ్యలో చేతులెత్తేసింది. ఒక్కో యాత్రికుని దగ్గర రూ.1.70 లక్షలు వసూలు చేసిన సదరన్ ట్రావెల్స్, ఎలాంటి వసతులు కల్పించకుండా మధ్యలోనే వదిలేసింది. యాత్రికుల్లో ఏపీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సరైన వసతి, భోజన ఏర్పాట్లు లేక యాత్రికులు నానా అవస్థలు పడుతున్నా సదరన్ ట్రావెల్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో యాత్రికులంతా యమునోత్రి బస్టాప్ లో తల దాచుకోవాల్సి వస్తోంది.