రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై కేసు నమోదు...!

రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై కేసు నమోదు...!

ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పై కేసు నమోదైంది. ఒక చానల్ చర్చ కార్యక్రమమంలో ఎస్సీ,ఎస్టీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపిస్తు కొందరు ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోదక చట్టం కింద నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

అంటరానితనాన్ని కొనసాగించాలనేలా ఆయన మార్చి 23న కరోనాపై పద్యం పాడారని, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజునే ఒక యూట్యూబ్ చానల్ లో ప్రసారం చేశారని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఫిర్యాదు చేశారు.న్యాయ నిపుణుల సలహా తీసుకుని కేసుపై దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు.