జలమే అజెండా...

జలమే అజెండా...

విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నడుంకట్టారు. ప్రగతిభవన్‌లో సమావేశమైన ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారాల మార్గాలపై చర్చిస్తున్నారు. ఏపీ నుంచి సీఎం జగన్‌తో పాటు ఆరుగురు మంత్రులు హాజరయ్యారు. ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, పేర్నినాని.. తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, శ్రీనివాస్ గౌడ్‌, ఎంపీ కేకే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఒక్కో రాష్ట్రం నుంచి దాదాపు 20 మంది అధికారులు కూడా రాగా... ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్న రిటైర్డ్ ఇంజినీర్లు, నీటిపారుదలశాఖ నిపుణులు దాదాపు 50 మంది వరకు హాజరయ్యారు. గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఎకరాకు నీరు అందించాలనే ప్రధాన ఎజెండాతో ఈ సమావేశం జరుగుతోంది. 

ఈ సమావేశం అజెండా:
1. గోదావరిని కృష్ణా బేసిన్‌కు తరలించడం
2. పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు
3. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన
4. విద్యుత్ బకాయిల వివాదాలు
5. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన
6. సొంత రాష్ట్రాలకు ఉద్యోగుల బదిలీ