16 మంది తెలుగు విద్యార్ధులకు ఊరట

16 మంది తెలుగు విద్యార్ధులకు ఊరట

ఫార్మింగ్ టన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో అరెస్ట్ అయిన 16 మంది విద్యార్థులకు కోర్టులో ఊరట లభించింది. ఫిబ్రవరి 26లోగా స్వదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. అరెస్ట్ అయిన మొత్తం 20 మంది విద్యార్ధుల్లో కేలహోన్ కౌంటీ జైళుల్లో 12 మంది, మన్రో కౌంటీ జైళ్లలో 8 మంది బందీలుగా ఉన్నారు. వీరిలో ముగ్గురికి ముందే స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించింది. మిగిలిన 17 మందిపై మంగళవారం విచారణ జరిగింది. వీరిలో 15 మందికి వాలంటరీ డిపార్చర్ (స్వచ్చందంగా స్వదేశాలకు) కింద అవకాశం కల్పించింది. మరో విద్యార్ధి కూడా స్వదేశానికి వెళ్లే అవకాశం కల్పించినా.. యూఎస్ గవర్నమెంట్ రిమూవల్ కింద వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. 17 వ విద్యార్థి యూఎస్ సిటిజన్ ను పెళ్లి చేసుకున్నాడు. అతను బెయిల్ బాండ్ కోసం దరఖాస్తు చేశాడు. మొత్తం  16 మంది విద్యార్థులు కోర్టు జడ్జిమెంట్ మేరకు వాలంటరీగా ఫిబ్రవరీ 26 లోగా యూఎస్ వదిలివెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు తిరుగు పయనమయ్యేందుకు టికెట్ల బుకింగ్, టైమింగ్,  జైల్ ఇమిగ్రేషన్ అధికారులకు విద్యార్ధులు ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జైల్ ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను జైళు నుంచి ఎయిర్ పోర్టుకు చేర్చే ఏర్పాట్లు చేస్తారు.