తెలుగు టైటాన్స్‌కు తలైవాస్‌ దెబ్బ

తెలుగు టైటాన్స్‌కు తలైవాస్‌ దెబ్బ

తెలుగు టైటాన్స్‌ మళ్లీ ఓడింది. ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7లో రెండో మ్యాచ్‌లోనూ టైటాన్స్‌ చతికిలబడింది. 26-39తో తెలుగు టైటాన్స్‌ను తమిళ్‌ తలైవాస్‌ చేతి చేసింది. గతేడాది వరకు టైటాన్స్‌ తరఫున సత్తా చాటిన రాహుల్‌ చౌదరీ ఈసారి తమిళ్‌ తలైవాస్‌ తరఫున బరిలోకి దిగి అదరగొట్టాడు. రాహుల్‌ ఏకంగా 10 పాయింట్లు సాధించడంతో టైటాన్స్‌ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. టైటాన్స్‌ భారీ ఆశలు పెట్టుకున్న సిద్ధార్థ్‌.. 13 సార్లు రైడ్‌కు వెళ్లి కేవలం 5 పాయింట్లే సాధించి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక.. టోర్నీలో భాగంగా ఇవాళ యు ముంబాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌.. పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడతాయి.