లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆపాలని పిటిషన్

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆపాలని పిటిషన్

వర్మ దర్శకత్వం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మార్చి 29 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావడంతో అనుకున్నట్టుగానే మార్చి 29 న రిలీజ్ చేస్తున్నారు.  ఎన్నికల ముందు బయోపిక్ లను రిలీజ్ చేయడం సబబు కాదని, ఎన్నికల కోడ్ లో ఆ విషయం స్పష్టంగా ఉందని చెప్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  అటు ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు.  

తెలుగుదేశం పార్టీ నాయకుల పిటిషన్ ను హైకోర్ట్ విచారణకు స్వీకరించింది. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ విషయం హై కోర్ట్ చేతిలో ఉండటంతో మరోమారు టెన్షన్ నెలకొంది.