ఇవాళ 47 డిగ్రీలకు పైనే..!

ఇవాళ 47 డిగ్రీలకు పైనే..!

ఎండలు దంచికొడుతున్నాయి... ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు... సాయంత్రం 5 దాటినా తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అయితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది రియల్ టైమ్ గవేర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్). ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు, విజయనగరం, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీలకు పైగా నమోదుకానున్నాయని ప్రకటించింది. ఇక గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి,  శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 43 నుండి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొంది. మరోవైపు వడగాల్పులు వీచే సూచనలున్నాయని ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగ నిపుణులు అంచ‌నా వేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి... ఎండల్లో తిరగకుండా, నీడపాటున ఉండాలని సూచించారు.