లంబసింగిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..

లంబసింగిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..

విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది... జిల్లాలోని పాడేరులో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... అమ్మవారిపాదాలులో 1 డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది... లంబసింగిలోనూ 1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు కాగా... చింతపల్లిలో 3.2 డిగ్రీలు, మినుములూరులో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతీ ఏడాది ఈ ఏరియాల్లో డిసెంబర్, జనవరి నెలల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఉదయం 11 గంటలైనా సూర్యుడు కనిపించడంలేదని స్థానికులు చెబుతున్నారు. మంచు విపరీతంగా పడుతుండడంతో చలి తీవ్రత పెరిగింది... చిన్నపిల్లలు, వృద్ధులు గజగజ వణికిపోతున్నారు.