పడిపోతున్న ఉష్ణోగ్రతలు

పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఉదయం 10 వరకు కూడా ఇలాగే ఉంటోంది. ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత మరింత పెరగడంతో.. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు చలికి అల్లాడిపోతున్నారు. మంగళవారం తిర్యాణి మండలంలో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జైనూరులో 5.2, ఆసిఫాబాద్‌లో 5, కెరమెరిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.