76 ఏళ్లలో ఈ ప్రాంతాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత

76 ఏళ్లలో ఈ ప్రాంతాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత

ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న రెండు ప్రాంతాలను ప్రకటించింది. భూమిపై నిప్పులు కురిసేంతలా ఎండలు కాసే ప్రదేశాలు పశ్చిమాసియాలో ఒకటి, దక్షిణాసియాలో ఒకటి ఉన్నట్టు ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. మొదటిది కువైట్ లో ఉండగా రెండోది పాకిస్థాన్ లో ఉన్నట్టు వాతావరణ పరిశోధన సంస్థ చెప్పింది.

వాషింగ్టన్ పోస్ట్ వార్తా కథనం ప్రకారం కువైట్ లోని మిత్రీబాహ్ లో జూలై 21, 2016లో ఉష్ణోగ్రత 53.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. పాకిస్థాన్ ఓలని తుర్బత్ లో మే 28, 2017లో 53.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కువైట్ లోని మిత్రీబాహ్ లో నమోదైన ఉష్ణోగ్రత డబ్ల్యుఎంవో ఆసియా ఖండ ప్రాంతంలోనే నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా గుర్తిస్తున్నట్టు ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రెండు ప్రాంతాలు డబ్ల్యుఎంఓ గుర్తింపు పొందిన గరిష్ట ఉష్ణోగ్రతలలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇవి గత 76 ఏళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు.

డబ్ల్యుఎంఓ జాబితాలో కాలిఫోర్నియా డెత్ వ్యాలీలోని ఫర్నేస్ క్రీక్ లో జూన్ 30, 2013లో నమోదైన 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను చేర్చలేదు. నిజానికి ఇది అత్యధిక ప్రపంచ ఉష్ణోగ్రత. 1913లో కాలిఫోర్నియాలోని ఈ ప్రదేశం ఇంకా ఎంతో వేడిగా ఉండేది. అప్పుడు ఉష్ణోగ్రత 56.7 డిగ్రీల వరకు చేరుకుంది. ఈ ఉష్ణోగ్రత భూమిపై అత్యంత వేడిమి కల ప్రాంతంగా గుర్తింపు పొందింది.