ఆలయ ధ్వజస్తంభం ధ్వంసం...డోన్ లో ఉద్రిక్తత 

ఆలయ ధ్వజస్తంభం ధ్వంసం...డోన్ లో ఉద్రిక్తత 

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.  గ్రామపంచాయతీ ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆలయంపై దాడులు జరిగాయనే న్యూస్ లు వస్తుండేవి.  తాజాగా ఇప్పుడు మరో ఆలయంపై దాడులు జరిగాయి.  కర్నూలు జిల్లాలోని డోన్ మండలంలోని వెంకటనాయుని పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీతారామ స్వామి ఆలయానికి చెందిన రాతి ధ్వజస్తంభాన్ని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.  దీంతో గ్రామంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.  పంచాయతీ ఎన్నికలు జరిగే సమయంలో ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు ఇస్తామని సర్పంచ్ అభ్యర్థి ప్రతిపాదన తీసుకురాగా, ఆ ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో ఎన్నికలు జరిగాయి.  ఫలితాల తరువాత అభ్యర్థి చెప్పిన విధంగా రూ. గ్రామాభివృద్ధికి రూ.30 లక్షల నగదు అందించాడు.  ఈ నేపథ్యంలో ఆలయంలోని ధ్వజస్తంభం ధ్వంసం కావడంతో గ్రామంలో అలజడి రేగింది.  ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.