ప్రసాద్ స్కీమ్ క్రింద ఆలయాల ఆభివృద్ది: కోటేశ్వరమ్మ

ప్రసాద్ స్కీమ్ క్రింద ఆలయాల ఆభివృద్ది: కోటేశ్వరమ్మ

సోమవారం విజయవాడలో దుర్గా టెంపుల్ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ... కేంద్రం ప్రకటించిన ప్రసాద్ స్కీమ్ క్రింద రాష్ట్రంలో ఆలయాల ఆభివృద్ది జరుగుతోందన్నారు. ప్రసాద్ స్కీమ్ క్రింద ఆలయం నుంచి డీపీఆర్ కేంద్రానికి పంపించామన్నారు. ప్రసాద్ స్కీమ్ క్రింద ఆలయం ఎంపిక చేయటం జరిగింది‌. అన్నదానం, పరిశుభ్రత, కుమ్మరిపాలె రొడ్డు అభివృద్ధి ప్రసాద్ స్కీమ్ క్రింద చేయాలని డీపీఆర్ పంపించాం అని కోటేశ్వరమ్మ తెలిపారు. ముఖ మండపం రాతి నిర్మాణం చేయడానికి దాతలు వచ్చారు. అమ్మవారి భూములలో ఉన్న కళాశాలలో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. ఆలయంలో జరుగుతున్న రాహుకేతు పూజలకు భక్తుల నుంచి స్పదన వస్తుంది. దుర్గా అమ్మవారి ఆస్థుల వివరాల బోర్డులు దేవాలయంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఉదయం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయ భక్తులు ప్రదక్షిణలు‌ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నామని ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.