దాడులపై 10 రోజుల ముందే సమాచారం?

దాడులపై 10 రోజుల ముందే సమాచారం?

శ్రీలంకకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఆ దేశ ప్రభుత్వానికి ముందే సమచారం అందిందా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి ఇంటెలిజెన్స వర్గాలు. ఆత్మాహుతి దాడి పొంచి ఉందని.. ఈనెల 11న భారీ మారణహోమం జరిగే ప్రమాదం ఉందని 10 రోజుల క్రితమే పోలీసు ప్రధానాధికారికి సమాచారం అందింది. అదే రోజున ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. దీంతోపాటు.. 'నేషనల్‌ తోహీత్‌ జమాత్‌-ఎన్‌టీజే' అనే సంస్థ ఆత్మాహుతి దాడికి ప్రణాళిక రచిస్తోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు స్పష్టం చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టినట్టు తెలుస్తోంది. 
ఇక.. ఇవాళ జరిగిన దాడులను పిరికిపంద చర్యను ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే అభివర్ణించారు. ఐతే.. నిర్ధరించుకోకుండా వస్తున్న ప్రచారాన్ని, వదంతులను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు.