నా మొదటి కారును వెతికి పెట్టాలంటూ అభిమానులను కోరిన సచిన్...

నా మొదటి కారును వెతికి పెట్టాలంటూ అభిమానులను కోరిన సచిన్...

భారత దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి అందరికి తెలుసు. తన 16 ఏళ్ళ వయసులో 1989 లో భారత జట్టులోకి వచ్చిన సచిన్ మొదటి కారు మారుతి సుజుకీ 800 ను కోలుగోలు చేసాడు. అయితే ఇప్పుడు సచిన్ ఆ కారును మిస్ అవుతున్నాను అని తెలిపాడు. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించాడు. సచిన్ మాట్లాడుతూ... ప్రస్తుతం నా కార్ల గ్యారేజీలో బీఎండబ్ల్యూ వంటి కార్లు ఉన్నాయి. కానీ నేను నా మొదటి మారుతి సుజుకీ 800 లేని లోటును అనుభవిస్తున్నాను అని చెప్పాడు సచిన్. కాబట్టి అభిమానులు ఎవరైనా తనకోసం ఆ కారును వెతికి పెట్టాలంటూ చెప్పాడు. నేను ఆ కారును మా ఇంటికి సమీపంలోని సినిమా హల్ వద్దకు ఎవరైనా తెస్తారా అని బాల్కనీలో కూర్చొని చూసేవాడిని అని తెలిపాడు. ఆ కారును నేను తీసుకున్న మొదట్లో మా ఇంట్లో తెలియకుండా బయటకు తీసుకెళ్ళేవాడిని అని తెలిపాడు. ఇప్పుడు దాని కోసం వెతుకుతున్నట్లు చెప్పిన సచిన్ ఎవరికైనా ఆ కారు గురించి తెలిస్తే నాకు తెలపండి అని వెల్లడించాడు. ఇక 24 ఏళ్ల తన క్రికెట్ కెరియర్ లో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా సచిన్ నిలిచాడు.