టెన్నిస్‌ స్టార్‌ ఆండీ ముర్రే కు కరోనా పాజిటివ్..

టెన్నిస్‌ స్టార్‌ ఆండీ ముర్రే కు కరోనా పాజిటివ్..

చైనాలో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. కరోనాకు వారు వీరు అనే తేడా లేదు. ఎవరికైనా ఎలాగైనా సోకవచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనాకు బలి కావాల్సి వస్తుంది.  ఇప్పటికే దేశంలో అనేకమంది రాజకీయ నాయకులు కరోనాబారిన పడ్డారు.  కరోనా వైరస్ వల్ల బలయ్యారు. తాజాగా... బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌, మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆండీ ముర్రే కరోనా బారీన పడ్డాడు. ముర్రేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గురువారం ప్రకటించడంతో రాబోయే ఆస్ట్రేలియా ఓపెన్‌-2021లో టెన్నిస్‌ స్టార్‌ పాల్గొనడం అనుమానంగా మారంది. టోర్నమెంట్‌ నిర్వాహకులు ఏర్పాటు చేసిన చార్టర్‌ విమానంలో ముర్రే ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం లండన్‌లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు.