చంద్రగిరిలో మళ్లీ టెన్షన్..!

చంద్రగిరిలో మళ్లీ టెన్షన్..!

రీపోలింగ్ జరుగుతోన్న చంద్రగిరిలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రగిరి నియోజకవర్గంలోని పులివర్తివారిపల్లి పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆందోళనకు దిగారు. వెంటనే పోలింగ్ నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఓటు వేసేందుకు వృద్ధులకు సహాయకులుగా ఎవరినీ పీవోలు అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె... తన కుమారుడితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. చివరకు పోలిసులు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పడంతో నిరసన విరమించారు.