లవ్ సూసైడ్.. శ్రీకాకుళంలో టెన్షన్ టెన్షన్ !

లవ్ సూసైడ్.. శ్రీకాకుళంలో టెన్షన్ టెన్షన్ !

శ్రీకాకుళం రిమ్స్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రకళ కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. వారికి ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తత మారింది. దీంతో వారిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. నాలుగు నెలల క్రితం శ్రీకాకుళానికి చంద్రకళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి ప్రేమవ్యవహారమే కారణమని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. 

రాజాం మండలం అంతకాపల్లికి చెందిన రవికుమార్ వల్లే చంద్రకళ ఆత్మహత్యకు పాల్పిడిందని చెప్తున్నారు ఆమె తల్లిదండ్రులు. రవికుమార్, చంద్రకళకు మధ్య కొంతకాలం ప్రేమ వ్యవహారం నడిచిందని.. చంద్రకళకు వేరే పెళ్లి నిర్ణయించడంతో ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు రవితో ఫోన్‌లో మాట్లాడింది చంద్రకళ. నిందితుడిని పట్టుకుని పోలీసులకు  అప్పగించారు చంద్రకళ పేరెంట్స్. అయితే రవికుమార్ దర్జాగా బయట తిరుగుతుండటంతో రిమ్స్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు.