హాజీపూర్‌లో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్..

హాజీపూర్‌లో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్..

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలంటూ గ్రామంలో దీక్షకు దిగిన గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు... అమ్మాయిలను చంపి శ్రీనివాస్‌రెడ్డి పాతిపెట్టిన బావిలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడుతూ.. ఇక తమకు న్యాయం జరగదని తమ పిల్లలు చనిపోయిన బావిలోనే తామూ చనిపోతామంటూ నలుగురు యువకులు బావిలో ఆందోళన చేపట్టారు. దీంతో బావి దగ్గరకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరితీసేవరకు పోరాటం చేద్దాం... మీరు బయటకు రండి అంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేయడంతో.. ఆ నలుగురు యువకులు బావి నుంచి బయటకు వచ్చారు. పోలీసులు గ్రామస్తుల దీక్షను భగ్నం చేసినా.. హాజీపూర్‌లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.