రాయ్‌గంజ్‌లో రెచ్చిపోయిన అల్లరిమూకలు..

రాయ్‌గంజ్‌లో రెచ్చిపోయిన అల్లరిమూకలు..

పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత నెలకొంది.. రాయ్‌గంజ్‌లో స్థానిక అల్లరి మూకలు రెచ్చిపోయాయి. గిరిపార్ పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. పోలింగ్‌ను అడ్డుకోవాలనే ఉద్దేశంతో జాతీయ రహదారి 34పై గందరగోళం సృష్టించారు. వెంటనే అలర్డ్ అయిన కేంద్ర భద్రతా బలగాలు.. వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అల్లరిమూలకను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు పోలీసులు... దీంతో పోలీసులపై రాళ్లు రువ్వాయి అల్లరిమూకలు. పరిస్థితి చేజారిపోవడంతో భద్రతాబలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. రెండో విడుత పోలింగ్‌లో భాగంగా ఇవాళ బెంగాల్‌లోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా... గతంలో చెలరేగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని... స్థానిక పోలీసులతో పాటు 15 వేల పారామిలటరీ బలగాలను కూడా మోహరించారు అధికారులు.