కన్నా ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్‌...

కన్నా ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్‌...

భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి... గుంటూరులోని కన్నా ఇంటి ముందు ఆందోళన నిర్వహించేందుకు ప్రయత్నించాయి తెలుగుదేశం పార్టీ వర్గీయులు... వారిని అడ్డుకునేందుకు బీజేపీ వర్గీయులు తరలివచ్చారు. దీంతో కన్నా ఇంటి ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం, ఘర్షణ జరిగింది. టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు. ఇరు వర్గాలను అదుపుచేసేందుకు పోలీసులు రంగంప్రవేశం చేయాల్సి వచ్చింది. కాగా, నిన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబును బీజేపీ నేతలు కాకినాడలో అడ్డుకున్న సంగతి తెలిసిందే.