మోడీ ప్రసంగిస్తుండగా కుప్పకూలిన టెంట్...

మోడీ ప్రసంగిస్తుండగా కుప్పకూలిన టెంట్...

ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న బహిరంగసభలో అపశృతి చోటుచేసుకుంది... పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా టెంట్ కూలిపోయింది. దీంతో తొక్కిసలాట జరిగి దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిని ప్రధాని మోడీ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు... వారికి ధైర్యం చెప్పారు. సరైన వైద్య సహాయం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రతికూల వాతావరణం కారణంగానే టెంట్ కూలినట్టు పోలీసులు తెలిపారు.