నేడు టెన్త్‌ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

నేడు టెన్త్‌ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి.  ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యా కమిషనరేట్‌లో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు.  ఫలితాల కోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఆర్టీజీఎస్ వెబ్‌సైట్, పీపుల్ ఫస్ట్ యాప్, ఖైజాలా యాప్, ఫైబర్ నెట్ టీవీ తెరపై కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది.  పది పరీక్షలకు మొత్తం 6,21,634 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 99.5 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఫలితాల కోసం..
ఆర్టీజీఎస్ వెబ్‌సైట్ www.rtgs.ap.gov.in 
పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్ https://bit.ly/2E1cdN7 
ఖైజాలా యాప్ https://aka.ms/apresult