బ్యాలెట్ పేపర్లకు చెదలు...

బ్యాలెట్ పేపర్లకు చెదలు...

మండల పరిషత్ ఎన్నికల్లో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఓట్లు లెక్కించడానికి అధికారులు బ్యాలెట్ బాక్స్‌ ఓపెన్ చేయగా... ఓ బాక్స్‌లోని ఓట్లు మొత్తం చెదలు పట్టిఉండడాన్ని చూసి షాక్ తిన్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే పరిషత్ ఎన్నికల్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం ప్రారంభమైంది... అయితే, మహాదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామానికి చెందిన బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ నిమిత్తం ఓపెన్ చేశారు అధికారులు. అయితే, బాక్స్‌లోని ఓట్లు పూర్తిగా చెదలు పట్టి ఉన్నాయి. దీంతో షాక్ తిన్న అధికారులు.. ఈ విషయాన్ని ఎంపీడీవో, డీపీవోకు సమాచారం ఇచ్చారు. చెదలు పట్టిన ఓట్లను పరిశీలించిన అధికారులు.. దీనిపై జిల్లా కలెక్టర్‌కి సమాచారం అందించారు. పై అధికారుల ఆదేశాలు వచ్చేవరకు ఆ బ్యాలెట్ బాక్స్ ను కౌంటింగ్ చేయకుండా నిలిపివేశారు. ఈ బ్యాలెట్ బాక్స్‌లో మొత్తం 395 ఓట్లు ఉన్నాయని అంటున్నారు అధికారులు.