అక్కడ కూడా బ్యాలెట్ పేపర్లకు చెదలు..

అక్కడ కూడా బ్యాలెట్ పేపర్లకు చెదలు..

మండల, జిల్లా పరిషత్ ఓట్ల లెక్కింపులో విచిత్రమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఎన్నికలకు నిర్వహించి దాదాపు నెల రోజులు కావొస్తుండడంతో కొన్ని బ్యాలెట్ పేపర్లను చెదలు తినేసింది. జయశంకర్ భూపాలపల్లిలో ఓ ఘటన జరగగా.. ఇలాంటి ఘటనే కొమరంభీం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కౌటాల మండలం గురుడుపేట ఎంపీటీసీ స్థానం పరిధిలోని తలోడిగ్రామం పోలింగ్ స్టేషన్ నెంబర్ 22కు చెందిన బ్యాలెట్ బాక్సులోని పేపర్లకు చెదలు పట్టింది. దాదాపు 60కి పైగా ఓట్లకు చెదలుపట్టిననట్టు అధికారులు గుర్తించారు.