చెన్నైలో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

చెన్నైలో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

చెన్నైలో ఓ అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. కందార్ప దాస్ అనే వ్యక్తి అరుంబాక్కమ్ లోని ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఇటీవల తోటి ఉద్యోగులతో కందార్ప గొడవపెట్టుకున్నాడు. ఆ క్రమంలో తాను ఉగ్రవాదినని..తనతో పెట్టుకుంటే చంపేస్తానంటూ హెచ్చరించాడు. దాంతో షాక్ తిన్న సిబ్బంది పోలీసులకుసమాచారమిచ్చారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేయగా కందార్ప నిజంగానే మిలిటెంట్ అని తేలింది. కందార్ప సెల్‌ఫోన్‌ ద్వారా కీలక వివరాలు బహిర్గతమయ్యాయి. అతడు తుపాకీ పట్టుకొని ఉన్న ఫొటోలు కనిపించడంతో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అసోంలోని ఘోరఖ్‌పూర్ కందార్ప స్వస్థలం. విచారణలో అతడు నిషేధిత గ్రేటర్ కూచ్‌బహర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కు చెందిన మిలిటెంట్‌గా తేలింది. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి కమ్తాపూర్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.