టీమిండియాకు ఉగ్ర ముప్పు..!

టీమిండియాకు ఉగ్ర ముప్పు..!

టీమిండియాకు ముప్పు పొంచిఉంది..! ఉగ్రవాదులు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ వచ్చిన ఓ ఈ మెయిల్ అధికారులను హడలెత్తించింది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జ్టటుపై దాడులు జరపబోతున్నామని ఓ మెయల్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు ఈనెల 16వ తేదీన వచ్చింది. దీంతో వెంటనే ఆ మెయిల్‌ను ఐసీసీకి పంపించింది. మరోవైపు బీసీసీఐకి కూడా అలాంటి మెయిలే రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బీసీసీఐ భారత హోంమంత్రిత్వ శాఖకు సమాచారం అందించడంతో.. అంటిగ్వాలోని భారత హైకమిషన్‌ను అలర్ట్ చేశారు. దీంతో వెస్టిండీస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. దీనిపై ఆంటిగ్వాలోని భారత హైకమిషన్‌కు సమాచారమిచ్చారు. తన ఆటగాళ్లకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ప్రభుత్వాధికారులకు కోరారు. 

మరోవైపు భారత హైకమిషన్‌.. స్థానిక ప్రభుత్వ యంత్రంగాన్ని అప్రమత్తం చేసినట్టు.. భారత ఆటగాళ్లకు గట్టి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆ అధికారి తెలిపారు. కాగా, కోహ్లీ సేన వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలసిందే.. ఇప్పటికే టీ-20, వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్ ఆడనుంది. ఓవైపు ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులతో ఆటగాళ్లకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.