పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదులు ప్లాన్‌ !

పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదులు ప్లాన్‌ !


పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదులు ప్లాన్‌ చేసినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగానికి సమాచారం అందింది. పుల్వామాలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి జరిగి ఈ నెల 14కు ఏడాది. దీంతో మరోసారి అలాంటి దాడికి స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం చేశారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంలో శిక్షణ పొందిన పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.