ఢిల్లీ విధ్వంసం కోసం భారీ కుట్ర... 

ఢిల్లీ విధ్వంసం కోసం భారీ కుట్ర... 

ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడి 40 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనా తరువాత ఇండియన్ ఆర్మీ పాక్ సైనిక స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే.  పుల్వామా దాటి కేసులో ఎన్ఐఏ ఛార్జీషీట్ రెడీ చేసింది.  ఈ ఛార్జ్ షీట్ లో షాక్ అయ్యే ఎన్నోవిషయాలు బయటకు వచ్చాయి.  పుల్వామా తరువాత ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో భారీ విధ్వంసాలకు పాల్పడేందుకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు భారీ కుట్ర చేసినట్టుగా ఎన్ఐఏ పేర్కొన్నది. 

ఢిల్లీలో రద్దీ ఎక్కువగా ఉండే హౌస్, దరియా గంజ్, కశ్మీరీ గేట్ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలని చూసినట్టు ఎన్ఐఏ పేర్కొంది.  ఈ ప్రాంతాల్లో అనేకసార్లు ఉగ్రవాదులు రెక్కీ కూడా నిర్వహించినట్టు  ఎన్ఐఏ వివరించింది.  పుల్వామా దాడిజరిగిన తరువాత పోలీసులు సజ్జద్ ఖాన్ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ఇంటరాగేషన్ చేసిన తరువాత ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  పుల్వామా దాడికి చూసి ప్రభావితమైన బిలాల్ అహ్మద్ అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి సిద్దపడినట్టుగా ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నది.  ఇక ఈ ఛార్జ్ షీట్ తరువాత ఢిల్లీ మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు.