టెస్లాకు ఝలక్.. అద్దం పగిలింది.. షేర్ పడిపోయింది..!

టెస్లాకు ఝలక్.. అద్దం పగిలింది.. షేర్ పడిపోయింది..!

టెస్లా ఏం చేసినా సంచలనమే.. ఆ సంస్థ తాజాగా సైబర్‌ట్రక్‌ పేరుతో ఒక ఎలక్ట్రిక్‌ పికప్‌ట్రక్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తూ చేసిన ట్రిక్‌తో కంపెనీ షేరు 6 శాతం పడిపోయింది. సైబర్‌ ట్రక్‌ వివరాలను వెల్లడిస్తున్న సమయంలో దాని కిటికీ అద్దాలు అసలు పగలవన్నారు ఎలన్‌ మస్క్‌. ఆ తర్వాత దానిపై ఒక లోహపు గుండు విసిరి ప్రత్యక్షంగా దాని శక్తిని చూపాలనుకున్నారు. ఈ క్రమంలో ఆ కిటికీ అద్దం పగిలింది. దీంతో మస్క్‌ షాక్‌కు గురైయ్యారు. ఈ ట్రక్‌ను మరింత మెరుగుపర్చాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో వాల్‌స్ట్రీట్‌లో టెస్లా షేర్లు 6శాతం పతనమయ్యాయి. దీనికి తోడు ఈ ట్రక్‌ డిజైన్‌ కూడా బాగోలేదని సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ జరిగింది. మరోపక్క టెస్లాకి పోటీగా విద్యుత్తు పికప్‌ ట్రక్‌ను 2021లో మార్కెట్లోకి  తీసుకురానున్న జనరల్‌ మోటార్స్‌ షేర్లు 2 శాతం పెరిగాయి.