1983 ప్రపంచకప్‌ కంటే పెద్ద విజయం: రవిశాస్త్రి

1983 ప్రపంచకప్‌ కంటే పెద్ద విజయం: రవిశాస్త్రి

ఆస్ట్రేలియాలో తొలిసారి భారత్‌ టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. 2-1 తేడాతో చారిత్రక సిరీస్‌ విజయాన్ని నమోదు చేసి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న టెస్ట్ సిరీస్ కలను సాకారం చేసింది. ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ విజయాన్ని నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా, ఆసియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 1983 ప్రపంచకప్‌ విజయం కంటే.. ఈ విజయం తనకు ఎంతో పెద్దదని భారత కోచ్  రవిశాస్త్రి పేర్కొన్నాడు. ట్రోఫీ ప్రదానోత్సవం అనంతరం రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు.

'1983 ప్రపంచకప్‌, 1985 వరల్డ్ ఛాంపియన్ షిప్ విజయం కంటే ఈ విజయం పెద్దది. చాలా పెద్దది. ఎందుకంటే క్రికెట్ లో టెస్ట్ ఫార్మాట్ కఠినమైనది.. ఇదే నిజమైన క్రికెట్ ఫార్మాట్. నేను చాలా సంతోషంగా ఉన్నా.. 4 సంవత్సరాల క్రితం విరాట్ ఇక్కడే తన జర్నీ మొదలు పెట్టాడు. ప్రపంచ కెప్టెన్లలో విరాట్ అంత అంకితభావం ఎవరిలో లేదు. కెప్టెన్లలో విరాట్ కి దగ్గర కూడా ఎవరూ లేరు. మైదానంలో కూడా తెలివిగా ఉంటాడు. జట్టులోని అందరు కుర్రాళ్లు విరాట్ ను గమనిస్తున్నారు. అతన్ని అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.