'అరవింద సమేత' టీజర్ చాలా బాగుందంటున్న నిర్మాత !

'అరవింద సమేత' టీజర్ చాలా బాగుందంటున్న నిర్మాత !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'అరవింద సమేత' చిత్రం యొక్క టీజర్ రేపు ఉదయం 9 గంటలకు విడుదలకానుంది.  ఇప్పటికే సిద్దమైన టీజర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ వీక్షించారట.  

దీని గురించి ఆయన మాట్లాడుతూ టీజర్ ఫైనల్ ఔట్ ఫుట్ చాలా గొప్పగా ఉంది.  ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నా టీజర్ మీకందరికీ నచ్చుతుంది.  ఎన్టీఆర్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపగా త్రివిక్రమ్ కసిగా వర్క్ చేసి సినిమా చేస్తున్నారు అన్నారు.  పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్లో నడిచే కథగా ఉండనుంది.