అమెజాన్ నుండి తెలుగు సినిమాలకు ఊరట !

అమెజాన్ నుండి తెలుగు సినిమాలకు ఊరట !

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల ద్వారా తెలుగు సినిమాలకు పెద్ద సమస్య తెలెత్తిన సంగతి తెలిసిందే.  సినిమాలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్నా అమెజాన్ లాంటి సంస్థలు వాటిని డిజిటల్ స్ట్రీమింగ్ చేసేసేవి.  దీంతో సినిమా వసూళ్లకు పెద్ద  నష్టం ఏర్పడింది.  ఇటీవల రిలీజైన 'ఎఫ్ 2' సినిమానే దానికి మంచి ఉదాహరణ.  

సినిమా థియేటర్లో నడుస్తుండగానే డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా టీవీల్లో ప్రత్యక్షమైంది.  దీంతో ఆలోచనలో పడిన నిర్మాతలు ఇకపై సినిమా విడుదలైన 8 వారల తరవాతే డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని నిబంధన విధించారు.  ఈ  నిబంధన ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది.  దీని మూలంగా తెలుగు సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ నుండి పెద్ద ముప్పు తప్పింది.