'వివేకా హత్య కేసుపై ఇప్పడే ఏమీ చెప్పలేం'

'వివేకా హత్య కేసుపై ఇప్పడే ఏమీ చెప్పలేం'

మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణ జరుగుతోందని ఏపీ డీజీపీ ఠాకూర్‌ అన్నారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలన జరుగుతోందని.. ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. విశాఖలో కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో విచారణ జరగుతోందన్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి అనేక మందిని అరెస్టు చేశామని.. ఒక కార్యక్రమం పేరుతో అనుమతి తీసుకుని రేవ్ పార్టీ నిర్వహించారని చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన డీజీపీ.. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.