అజిత్.. బోనీకపూర్ సినిమా కన్ఫర్మ్..!!

అజిత్.. బోనీకపూర్ సినిమా కన్ఫర్మ్..!!

విశ్వాసంతో తమిళ ప్రజల విశ్వాసాన్ని చొరగొన్న అజిత్ కుమార్.. కొత్త సినిమాను ప్రకటించాడు.  అజిత్ 59 వ సినిమాగా రాబోతున్న సినిమాను హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మిస్తున్నాడు.  ఇందులో విద్యాబాలన్ హీరోయిన్.  మిగతా క్రూను కూడా యూనిట్ ప్రకటించింది.  2పాయింట్ 0 సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన నీరవ్ షా అజిత్ 59 సినిమాకు పనిచేస్తున్నారు.  రౌడీ బేబీ అంటూ తమిళ ప్రజలను ఉర్రూతలు ఊగించిన యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019 సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారట.  దర్శకుడు శివతోవరసగా నాలుగు సినిమాలు చేసిన అజిత్, చాలా కాలం తరువాత మరో దర్శకుడితో సినిమా చేస్తున్నారు.  జులై 2019 నుంచి మరో సినిమా ప్రారంభం అవుతుందని అజిత్ ప్రకటించారు.