మరో అద్భుతాన్ని సృష్టించబోతున్న అజిత్ టీమ్

మరో అద్భుతాన్ని సృష్టించబోతున్న అజిత్ టీమ్

అజిత్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన సంగతి చాలా మందికి తెలియదు.  ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు చదివిన చదువును సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.  ఇటీవలే అజిత్ మార్గదర్శకత్వంలో ఎంఐటి టీమ్ దక్ష అనే డ్రోన్ ను తయారు చేసింది.  వీళ్ళు సాధించిన కృషికి తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ఇటీవల అబ్దుల్ కలాం అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.  

ఇప్పుడు అజిత్ టీమ్ మరో రికార్డును సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.  అజిత్ టీమ్ తయారు చేసిన దక్ష డ్రోన్.. ఆస్ట్రేలియాలో జరుగుతున్న డ్రోన్ ఒలంపిక్స్ లో పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.  ప్రపంచంలోని 13 టీమ్ లు ఈ పోటీల్లో పోటీ పడుతున్నారు.  మరి ఈ పోటీల్లో దక్ష డ్రోన్ ఎలాంటి పెర్ఫార్మన్స్ చేస్తుందో చూడాలి.  మెరుగైన ప్రదర్శన ఇవ్వగలితే.. అజిత్ టీమ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్టే అవుతుంది.