తలా అజిత్ టీమ్ కు అబ్దుల్ కలాం అవార్డు

తలా అజిత్ టీమ్ కు అబ్దుల్ కలాం అవార్డు

కోలీవుడ్ మాస్ నటుల్లో తలా అజిత్ ఒకరు.  అటు క్లాస్ సినిమాల్లో మెప్పిస్తూనే.. మాస్ కు నచ్చే సినిమాలు చేయడంలోను అజిత్ దిట్ట.  ఇటీవలే వచ్చిన అజిత్ వివేగం సినిమా ఎలాంటి హిట్టయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  సినిమా రంగంలోనే కాకుండా అజిత్, సేవా రంగంలో కూడా ముందుంటాడు.  ఇటీవలే మద్రాస్ ఐఐటిలో అజిత్ సందడి చేశాడు.  విద్యార్థులు తయారు చేసిన దక్ష అనే డ్రోన్ ఎయిర్ క్రాఫ్ట్ టీమ్ గైడ్ గా వ్యవహరించారు.  ఈ సూపర్ డ్రోన్ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేసిన టీమ్ కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం సైంటిఫిక్ అవార్డును ప్రకటించింది.  ఈ సందర్భంగా అజిత్ తన దక్ష టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.