తెలుగు ప్రేక్షకులు "విశ్వాసం" చూపిస్తారా?

తెలుగు ప్రేక్షకులు "విశ్వాసం" చూపిస్తారా?

అజిత్ కుమార్ హీరోగా చేసిన విశ్వాసం సినిమా తమిళంలో ఎంత పెద్ద హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.  ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా ఏకంగా రూ.125 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.  మొత్తంగా ఈ సినిమా రూ.150 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అజిత్ స్టామినా ఏంటో నిరూపించింది.  

ఈ సినిమాను తెలుగులో విశ్వాసం పేరుతోనే డబ్బింగ్ చేస్తున్నారు.  మార్చి 1 వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని 400 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నది.  మంచి రేటుకు అమ్ముడుపోయిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో రూ.2.50 కోట్ల రూపాయల షేర్ ను సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే.  మరి అజిత్ విశ్వాసంపై తెలుగు ప్రేక్షకులు విశ్వాసం చూపిస్తారా..? చూద్దాం.